దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు రోజురోజుకు పెరిగి పెరిగి పోతున్నాయి. తాజాగా పెట్రోల్ డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. లీటర్ పెట్రోల్ పై 37 పైసలు పెరగగా డీజిల్ పై 38 పైసలు పెరిగింది. తాజాగా పెరిగిన ధరలతో హైదరాబాదులో లీటర్ పెట్రోల్ ధర రూ.110.46 గా ఉండగా డీజిల్ ధర రూ. 103.56 కు చేరింది. ఇక ఏపీలోని విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.112.75 ఉండగా డీజిల్ ధర.105. 20 కి చేరింది. ఈ నెలలోనే ఇప్పటివరకు పెట్రోల్ ధర రూ.5. 50 పైసలకు పెరిగింది.
పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడంతో సామాన్యులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెట్రోల్ డీజిల్ ధరల ప్రభావం నిత్యావసరాల పై సైతం పడింది. దాంతో కూరగాయలు ఇతర నిత్యావసర ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇక పెట్రోల్ ధరలు రోజురోజుకు పెరుగుతుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నాయి.