బ్రాండెడ్‌ పేరిట నకిలీ నిత్యవసర వస్తువుల సరఫరా….. ముఠా అరెస్టు

-

బ్రాండెడ్‌ ముసుగులో నకిలీ నిత్యావసర వస్తువులు  తయారు చేస్తున్న ముఠా గుట్టు బయట పడింది. నలుగురిని ఈస్ట్‌ జోన్‌, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు.బ్రూక్‌బాండ్‌ టీ పౌడర్‌,రెడ్‌లేబుల్‌, సర్ఫ్‌ ఎక్సెల్‌, ఎవరెస్ట్‌ మసాలా, లైజాల్‌, హార్పిక్‌,పారాచూట్‌ హెయిర్‌ ఆయిల్‌ పేరుతో నకిలీవి తయారు చేస్తున్నారని ఈస్ట్ జోన్ డీసీపీ గిరిధర్‌ వెల్లడించారు.కాటేదాన్, నాగారం ప్రాంతాల్లో తయారీ కేంద్రాలు ఏర్పాటు చేసుకొని నకిలీ నిత్యవసర వస్తువుల తయారీ దందా సాగిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

దాదాపు రూ.2 కోట్ల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకుందామని తెలిపారు. ఇప్పటి వరకు నలుగురిని అరెస్టు చేశామని, మరో ముగ్గురు పరారీలో వెల్లడించారు. రాజస్థాన్‌,బీహార్ రాష్ట్రాలకు చెందిన నిందితులు…. నకిలీ వస్తువులను నగరంలోని వివిధ కిరాణా దుకాణాలకు సరఫరా చేశారని తెలిపారు. నకిలీ నిత్యవసర వస్తువులను ఉపయోగించడం వలన ప్రజలు అనారోగ్యానికి గురై పలు వ్యాధులతో బాధపడాల్సి వస్తుందని టాస్క్ ఫోర్స్ డీసీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. కొందరు వ్యాపారులు, దుకాణాదారులు నకిలీ వస్తువులని తెలిసినా కూడా డబ్బు మీద అత్యాశతో వినియోగదారులకు అమ్ముతున్నారని తెలిపారు. ఒకవేళ ఎవరైనా నకిలీ వస్తువులను అమ్మినట్లు తెలిస్తే పోలీసులకు వెంటనే ఫిర్యాదు అందించాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news