రంగుల రాజకీయం : ఏపీ సర్కార్ కి సుప్రీం షాక్..!

-

 

ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఆయన ప్రభుత్వానికి కోర్టుల్లో వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఏపీలోని ప్రభుత్వ కార్యాలయాలకు వేసిన వైసీపీ రంగులను తొలగించాలంటూ ఇటీవల హైకోర్టు తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. అయితే ఏపీ సర్కార్ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్ ను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పును వెలువరించింది. నాలుగు వారాల్లోగా రంగులను తొలగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. లేని పక్షంలో కోర్టు ధిక్కారణ కింద చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version