అమరావతి కేసుల విచారణను సుప్రీంకోర్టు ఏప్రిల్ కి వాయిదా వేసింది. ఏప్రిల్ లో పూర్తిగా వాదనలు విన్న తర్వాత మాత్రమే తీర్పు వెలువరిస్తామని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు సమంజసం కాదని ఏపీ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి తన వాదనలు వినిపించాడు.ఈ కేసులో ఇంకా లిఖిత పూర్వక అఫిడవిట్లు దాఖలు చేయడం పూర్తి కాలేదని రైతుల తరపున న్యాయవాది దేవదత్ కామత్ అన్నారు. నాలుగు వారాల లోగా అఫీడవెట్, కౌంటర్ అఫీడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి అని గతంలో హైకోర్టు తీర్పు విలువరించిన విషయం మనకు తెలిసిందే. ఈ తీర్పులకు సవాల్ విసురుతూ ఏపీ సర్కార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు వేసింది. ఏపీకి మూడు రాజధానులు ఉండాలంటూ జగన్ ప్రభుత్వం ప్రకటన జారీ చేయడంతో అటు అమరావతికి చెందిన రైతులు ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి.