ఆర్‌-5 జోన్‌ స్టేపై సుప్రీంకు వెళ్లిన ప్రభుత్వం

-

ఆర్-5 జోన్లో ఇళ్ల నిర్మాణంపై ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. హైకోర్టు ఇచ్చిన స్టేను సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. దీనికి ధర్మాసనం… రిజిస్ట్రీ డైరీ నంబర్ కేటాయించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ వేస్తే తమ వాదనలూ వినాలని రాజధాని రైతులు కోరుతున్నారు. కాగా వారు సుప్రీంకోర్టులో ఇప్పటికే కేవియట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

రాజధాని అమరావతి మాస్టర్‌ప్లాన్‌ను మార్చి, ఆర్‌-5 జోన్‌ ఏర్పాటు, బయటి ప్రాంతాలకు చెందిన వారికి ఇళ్ల స్థలాలివ్వడం, ఇళ్ల నిర్మాణాలు చేపట్టడాన్ని సవాల్‌ చేస్తూ.. దాఖలైన కేసులు కోర్టుల్లో పెండింగ్‌లో ఉండగానే..రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఇళ్లు నిర్మించడం విస్తృత ప్రజాప్రయోజనాలకు విరుద్ధమని హైకోర్టు పేర్కొంది. రాజధానిలో బయటి ప్రాంతాల వారికి ఇచ్చిన ఇళ్లపట్టాలపై.. కోర్టు తుది తీర్పునకు లోబడే లబ్ధిదారులకు హక్కు దాఖలు పడుతుందని.. సుప్రీంకోర్టే విస్పష్టంగా చెప్పిన విషయాన్ని జస్టిస్‌ డి.వి.ఎస్‌.ఎస్‌.సోమయాజులు, జస్టిస్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌, జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరిలతో కూడిన ధర్మాసనం గుర్తు చేసింది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version