ఈ నెల 27వ తేదీకి విచారణను వాయిదా వేసిన కోర్టు…బీఆర్ఎస్ శ్రేణుల్లో టెన్షన్

-

ఢిల్లీ లిక్కర్ స్కామ్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను నీడలా వెంటాడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడుసార్లు.. దాదాపుగా 30 గంటలపాటు ఆమె పై ప్రశ్నల వర్షం కురిపించారు. మొన్న (21వ తేదీన) కవితను విచారించి.. పంపించారు. తదుపరి విచారణ ఎప్పుడో తెలియజేయలేదు. అరగంటలో మెయిల్ చేస్తారనే వార్తలు వినిపించాయి. దీంతో కవిత అండ్ కో..హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఈడీ విచారణ ముగిసినట్టేనని లోలోన సంబర పడ్డారు. ఈడీ వ్యవహార శైలిపై కల్వకుంట్ల కవిత సర్వోన్నత్య న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ విచారణ ఈ నెల 24వ తేదీ (శుక్రవారం) జరగనుంది. ఇంతలో పిటిషన్ విచారించే ధర్మాసనం తేదీని మార్చింది. శుక్రవారం కాకుండా.. సోమవారం 27న విచారిస్తామని జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ బేలా త్రివేదితో కూడిన ధర్మాసనం తెలిపింది.

దీంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది. ఈడీ అధికారులు మహిళా హక్కులను కాలరాస్తున్నారని కవిత తన పిటిషన్‌లో పేర్కొన్నారు. తనను రాత్రి 8 గంటల వరకు ఈడీ కార్యాలయంలో కూర్చొబెట్టడంపై సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సూర్యాస్తమయం తర్వాత మహిళను విచారణ కోసం కార్యాలయంలో ఉంచకూడదని చట్టం చెబుతోందని కవిత తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనికి ప్రతీగా ఈడీ కూడా పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ విచారణ శుక్రవారం కాకుండా.. సోమవారం రావడంతో ఏం జరుగుతుందని బీఆర్ఎస్ శ్రేణులు సందేహాం పడుతున్నారు. ఈ గ్యాప్‌లో మళ్లీ ఈడీ నుంచి నోటీసులు రావడం.. విచారణకు పిలుస్తారా అనే సందేహాలు వస్తున్నాయి.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version