బిడ్డ తెల్లగా పుడితే అక్కడ వెంటనే చంపేస్తారట..!

-

పుట్టే బిడ్డ తెల్లగా ఉండాలని.. మన దగ్గర గర్భందాల్చినప్పటి నుంచే ప్రత్యేకమైన ఆహారాలు తీసుకుంటారు. కుంకుమపువ్వు అయితే మరీను..అసలు దీనివల్ల నిజంగా బిడ్డ తెల్లగా పుడతాడా లేదా అని పక్కన పెడితే..దాదాపు అందరూ గర్భవతులుగా ఉన్నప్పుడు కుంకుమపువ్వు తినే ఉంటారు. కానీ ఒక దగ్గర మాత్రం బిడ్డ తెల్లగా పుడితే చంపేస్తారట..! మీరు విన్నది నిజమే..!

టెక్నాలజీ ఓ పక్క దూసుకెళ్తుంది.. కానీ ఇప్పటికీ రాతియుగంలా జీవిస్తున్న ఓ తెగ ఉంది. ఆ తెగ పేరు జార్వా..వీరు భారతదేశంలోని అండమాన్-నికోబార్ దీవులలో నివసిస్తున్నారు.. వీళ్ల ఆచారాలు తెలిస్తే వెన్నులో వణుకు పడుతుంది. ప్రస్తుతం జార్వా తెగకు చెందిన 380 మంది మాత్రమే మిగిలారు. ఈ తెగకు చెందిన ప్రజలు ఇప్పటికీ వేట ద్వారా మాత్రమే జీవిస్తున్నారు. విల్లు, బాణాలను ఉపయోగించి చేపలు లేదా పీతలను వేటాడతారు. గుంపులుగా పందులను వేటాడతారు.

బిడ్డ తెల్లగా ఉంటే చంపేస్తారు..

జార్వా తెగలో మరికొన్ని వింత ఆచారాలు పాటిస్తారు. అందులో ఒకటి ఏంటంటే.. ఒక మహిళ అందంగా, తెల్లగా ఉన్న పాపకు జన్మనిస్తే.. ఆ బిడ్డను వెంటనే చంపేస్తారట… దానికి కారణం జర్వా తెగ ప్రజలు నల్లజాతీయులు. వీరి రంగు నలుపు. అప్పుడు తెల్లని చర్మం గల శిశువు మరొక తెగ లేదా సమాజానికి చెందినదనే భావనతో చంపేస్తారట.. ఈ తెగలో పాప పుడితే ఆ తెగలోని ఆడవాళ్ళందరూ తల్లిపాలు ఇస్తారు. సమాజం కలిసి ఉండేందుకు ఇది దోహదపడుతుందని ఆ తెగ నమ్ముతుంది.

ఈ తెగలో.. నల్ల పిల్లవాడు లేదా పిల్ల కలిగి ఉండటం అవసరం. అందుకు గర్భిణికి జంతువుల రక్తాన్ని కూడా తాగిస్తారు. జంతువు రక్తం తాగిన తర్వాత పుట్టిన బిడ్డ రంగు నల్లగా మారుతుందని వారి నమ్మకం. హవోక్ అంటే తెల్ల బిడ్డ పుడితే.. ఆ శిశువును అతని తండ్రి చంపేస్తాడు.

ఒక స్త్రీ వితంతువుగా మారితే.. ఆమె పిల్లలను చంపుతారు. ఈ తెగ ప్రజలు ఇప్పటికీ ఇతర వ్యక్తులతో కలవరు. బహుశా ఈ వింత ఆచారాల వల్లనే జార్వా తెగ అంతరించిపోయే దశకు చేరినట్లు ఉంది.. జార్వా తెగ ప్రజలను కలవడానికి పర్యాటకులకు అనుమతి లేదు.. నేటికి ఇలాంటి ఆచారాతో ఈ తెగ వారు బతుకుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version