ఢిల్లీ : పెగాసస్ వ్యవహారంపై దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. పెగాసస్ వ్యవహరం పై సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు… పెగసస్ వ్యవహారం పై కీలక వ్యాఖ్యలు చేశారు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ. మనం సమాచార యుగం లో జీవిస్తున్నామని… సాంకేతికత ఎంత ముఖ్యమో గుర్తించాలని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగంపై పరిశీలన చేస్తామని.. వ్యక్తిగత గోప్యతకు భంగం కల్గించడాన్ని సహించమని స్పష్టం చేశారు. ప్రజలకు గోప్యత పాటించే హక్కుంది. ఈ హక్కును కాపాడాల్సిన అవసరముందన్నారు.
గోప్యత హక్కును కాపాడుకోవడం ముఖ్యమని… సుప్రీం కోర్టు పర్యవేక్షణలో పెగాసస్ పై నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు సుప్రీం కో ర్టు చీఫ్ జస్టిస్. పిటిషనర్లు లేవనెత్తతిన అంశాలపై దర్యాప్తు చేసేందుకు నిపుణుల కమిటీ పని చేయనుందని చెప్పారు.
సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జీ ఆర్వీ రవీంద్రన్ నేతృత్వంలో కమిటీ వేస్తున్నామని.. ప్రకటించారు చీఫ్ జస్టిస్. జస్టిస్ ఆర్వీ రవీంద్రన్, అలోక్ జోషీ, మరియు సందీప్ ఒబరాయ్ ఈ కమిటీలో సభ్యులు గా ఉంటారని స్పష్టం చేశారు ఎన్వీ రమణ. ఈ కమిటీ ఏడు అంశాలపై దర్యాప్తు చేయనుందన్నారు. అలాగే… పెగాసస్ పై కమిటీ ఏర్పాటు చేస్తామన్న కేంద్రం ప్రతి పాదనను తిరస్కరించింది సుప్రీం కోర్టు.