నూతన చట్టాలను రద్దు చేయాలని గత 22 రోజులుగా హస్తినా సరిహద్దులో రైతన్నలు చేస్తున్న ఉద్యమం రోజురోజుకు ఉధతమవుతోంది. ఈ నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం ఈ రోజు మరోసారి విచారణ చేపట్టనుంది. ఈ సమస్య పరిష్కారం కోసం ఓ ప్రత్యేక కమిటీని వేయాలని చెప్పిన కోర్టు.. నేడు మరోసారి రహదారుల దిగ్బంధంపై విచారణ జరపనుంది.
వివిధ ప్రాంతాల నుంచి దిల్లీకి వచ్చే ప్రధాన రహదారుల్లో రైతులు బైఠాయించడంతో సామాన్యుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో వారికి అక్కడి నుంచి ఖాళీ చేయించి మార్గం సుగమం చేయాలని దిల్లికి చెందిన ‘రిషబ్ శర్మ’ వేసిన పిటీషన్‌పై కోర్డు విచారణ చేపట్టనుంది.ఇక న్యాయస్థానం వెలువరించే తీర్పుపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
బ్రిటన్ నుంచి మద్దతు..
బ్రిటన్ ప్రతిపక్ష లేబర్ పార్టీ ఓ ఎంపీ రైతన్నలపై భారత ప్రభుత్వం తీరును ఖండించారు. తమ సమస్య పరిష్కారం కోసం శాంతియుతంగా ఉద్యమం చేస్తే జలఫిరంగులతో భయభ్రాంతులకు గురు చేయడం న్యాయం కాదన్నారు. భారత పర్యటనలో ఉన్న బ్రిటన్ విదేశాంగ మంత్రితో రైతుల పోరాటం వివరించారు. రైతులకు తమ మద్దతు ఉంటుందని బ్రిటన్ ఎంపీ ప్రీత్‌కౌర్ గిల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
కేజ్రీవాల్ సంతాపం..
హరియాణాకు చెందిన సిక్కుమత బోధకుడు సంత్‌రామ్ సింగ్ బుధవారం సింఘ సరిహద్దు వద్ద రైత ఉద్యమానికి సంఘీభావం ప్రకటించి తుపాకీతో కల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయన మతిపట్ల దిల్లి ముఖ్యమంత్రి ఆరింద్ కేజ్రీవాల్ సంతాపం ప్రకటించారు. రైతులు కొత్త డిమాండ్లు∙ఏమీ కోరుకోవడం లేదని, కేవలం వారి హక్కులను మాత్రమే కోరుకుంటున్నారు.. ప్రభుత్వం స్పందించి నూతన చట్టాలను వెనక్కి తీసుకోవాలని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.