బెయిల్ పిటీషన్ వాయిదాలపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు

-

బెయిల్‌ అంశాలకు సంబంధించి భారత దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వాటిని అనవసరంగా వాయిదా వేయకూడదని ఢిల్లీ హైకోర్టును ఉద్దేశిస్తూ తెలిపింది. మనీలాండరింగ్‌ కేసులో ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్‌ జైన్‌ బెయిల్‌ విజ్ఞప్తిపై తదుపరి విచారణలో నిర్ణయం తీసుకుంటుందని పేర్కొంది.సీఎం అరవింద కేజ్రీవాల్‌కు ట్రయల్‌ కోర్టు ఇచ్చిన బెయిల్‌పై స్టే విధించడం అసాధారణంగా పరిగణించిన సుప్రీం కోర్టు.. మరో కేసులోనూ ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం తీరుపై ఇలా వ్యాఖ్యానించింది.

తన బెయిల్‌ పిటిషన్‌ను విచారించకుండా ఢిల్లీ హైకోర్టు సుదీర్ఘకాలం వాయిదా వేయడంపై మాజీ మంత్రి సత్యేందర్‌ జైన్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీనిని పరిశీలించిన జస్టిస్‌ మనోజ్‌ మిశ్రా, జస్టిస్‌ ఎస్‌వీఎన్‌ భట్టీలతో కూడిన ధర్మాసనం.. ”బెయిల్‌ వ్యవహారాలను అనవసరంగా వాయిదా వేయకూడదు.అందుకే తదుపరి విచారణ తేదీన హైకోర్టు నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నాం” అని వెల్లడించింది. జులై 9న హైకోర్టు విచారణ చేపట్టనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version