అధికారిక లాంఛనాలతో నేడు సురవరం సుధాకర్ రెడ్డికి వీడ్కోలు పలుకనున్నారు. ఈ మేరకు అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. ఇవాళ ఉదయం 9 గంటలకు కేర్ హాస్పిటల్ నుంచి సురవరం సుధాకర్ రెడ్డి భౌతికకాయం తరలించనున్నారు.

10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రజల సందర్శనార్థం మఖ్దూం భవన్లో సురవరం భౌతికకాయం ఉంటుంది. ఇవాళ సురవరం మృతదేహానికి నివాళులు అర్పించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు.