సలార్ మూవీ నుంచి ‘సూరీడే గొడుగు పట్టి’ ఫుల్ సాంగ్ వీడియో రిలీజ్

-

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన చిత్రం సలార్. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న విడుదలైన ఈ చిత్రం భారీ వసూళ్లను సాధించింది.దాదాపు 700 కోట్లకు పైగా వసూళ్లను వసూలు చేసింది.

తాజాగా ఈ సినిమాలోని ఫ్రెండ్షిప్ సాంగ్ ‘సూరీడే గొడుగు పట్టి’ ఫుల్ వీడియోను మేకర్స్ ఎట్టకేలకు రిలీజ్ చేశారు.ఈ చిత్రంలో శృతిహాసన్ కథానాయికగా నటించింది. మలయాళం నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, ఈశ్వరి కుమారి , శ్రీయ రెడ్డి తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలలో నటించారు.హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై విజయ్‌ కిరగందూర్‌ ఈ చిత్రాన్ని నిర్మించాడు.రవి బస్రూర్ సంగీతాన్ని అందించాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సీక్వెల్ గా శౌర్యంగా పర్వం రానున్నట్లు ఇప్పటికే ప్రశాంత నీల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం ఇప్పటికే ఫ్యాన్స్ ఎంతో    ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version