వైసీపీలో సర్వే టెన్షన్..ఆ 25 సీట్లే ముంచేది..!

-

ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతుంది..మరో ఏడాదిన్నరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈలోపు జగన్ ఆలోచన మారి..ముందస్తు ఎన్నికలకు వచ్చినా రావొచ్చు..అందుకే ఎవరికి వారు ఇప్పటినుంచే గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నారు. అలాగే ఏపీలో సర్వే సంస్థలు కూడా రంగంలోకి దిగేసి..సర్వేలు చేస్తున్నాయి. ఇటు ఏ పార్టీకి ఆ పార్టీ సొంత సర్వేలు చేయించుకుంటుంది. ఇప్పటికే పలు సర్వేలు బయటపడిన విషయం తెలిసిందే.

ఇదే క్రమంలో వైసీపీ వర్గాల నుంచి రహస్యంగా అందిన సమాచారం ప్రకారం..ఇటీవల నాలుగు సర్వేలు జగన్ వద్దకు చేరాయని తెలిసింది..ఇంటిలిజెన్స్ సర్వే, ఐప్యాక్ సర్వే..అలాగే పార్టీలో ఉన్న ఇద్దరు నేతలు కూడా సర్వే చేసి..జగన్‌కు ఇచ్చారని తెలిసింది. ఈ సర్వేల్లో దాదాపు వైసీపీకి గెలుపు అంత ఈజీ కాదని తేలిందట. వైసీపీ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం..ప్రస్తుతం వైసీపీకి 61 సీట్లలో గెలిచే అవకాశం ఉందట. అలాగే టీడీపీకి 42, జనసేనకు 3 సీట్లలో గెలుపు ఛాన్స్ ఉందట.

ఇక 44 సీట్లలో టీడీపీ-వైసీపీల మధ్య టఫ్ ఫైట్ నడుస్తుందట. ఇక గెలుపోటములని తారుమారు చేసే సీటు 25 అని తెలిసింది. ఈ సీట్ల సంగతి ఏంటంటే..ఒకవేళ టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తే..ఈ 25 సీట్లు ఆ రెండు పార్టీలకే దక్కే ఛాన్స్ ఉందట..లేదంటే వైసీపీ గెలుచుకునే ఛాన్స్ ఉందట. అంటే పొత్తు ఉంటే వైసీపీకి గెలుపు దాదాపు కష్టం. ఎందుకంటే పైన చెప్పుకున్న ప్రకారం టీడీపీకి 42, జనసేనకు 3 అంటే 45..ఈ 25 కలుపుకుంటే 70.

అలాగే రెండు పార్టీల మధ్య పొత్తు ప్రభావం వల్ల టఫ్ ఫైట్ జరిగే సీట్లలో సగం అంటే 44లో సగం 22 సీట్లు…లేదా 20 సీట్లు గెలుచుకున్న టీడీపీ-జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని వైసీపీ అంతర్గత సర్వేల్లో తేలిందట. పొత్తు లేకపోతే..వైసీపీ 61తో పాటు 25..ప్లస్ టఫ్ ఫైట్ జరిగే సీట్లలో సగం గెలుచుకున్నా 88 మ్యాజిక్ ఫిగర్ దాటి మళ్ళీ అధికారంలోకి వస్తుందట. అంటే టీడీపీ-జనసేన పొత్తు వల్ల..ఓ 25 సీట్లతో వైసీపీ తలరాత మారిపోతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version