యాసంగి పంటకోసం రైతులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే నారుమడులు వేసుకుని సిద్ధంగా ఉన్న రైతులు యూరియా కోసం కేంద్రాల్లో పడిగాపులు గాస్తున్నారు. సిరిసిల్ల జిల్లాలోని వీర్నపల్లి మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు బారులు తీరిన దృశ్యాలు వెలుగుచూశాయి.
సకాలంలో యూరియా సరఫరా చేయకపోవడంతో ప్రభుత్వంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
యాసంగి దగ్గరికి వచ్చినా యూరియా కేంద్రాల్లో అందుబాటులోకి రాకపోవడానికి ప్రభుత్వమే కారణమని రైతులు మండిపడుతున్నారు. రైతుల సమస్యలను రేవంత్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, సకాలంలో పెట్టుబడి సాయం, యూరియా అందడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ రెడ్డి విస్మరించారని రైతులు వాపోతున్నారు.