ఫేస్‌బుక్‌లో వేధింపులు.. సెల్ఫీ వీడియో తీసుకుని యువతి ఆత్మహత్య

-

సోషల్ మీడియాలో ఖాతాలు తెరవడం.. అమ్మాయిలకు వల వేయడం.. ఆ తర్వాత వేధించడం సర్వసాధారణమైపోయింది. ముఖ్యంగా ఫేస్‌బుక్‌లో యువతులను పరిచయం చేసుకోవడం స్నేహ హస్తం చాచి నెమ్మదిగా వారిని వలలోకి దించడం.. ఆ తర్వాత అడిగింది చేయకపోతే బెదిరింపులకు పాల్పడటం చేస్తున్నారు కొందరు యువకులు. అలా ఓ యువకుడి వేధింపులకు గురైన యువతి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఏపీలోని సత్యసాయి జిల్లాలో చోటుచేసుకుంది.

సత్యసాయి జిల్లా తనకల్లు మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి (18) ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. నల్లచెరువుకు చెందిన యువకుడు ఫేస్‌బుక్‌లో పరిచమై వేధిస్తున్నాడని.. తన చావుకు అతనే కారణమని యువతి సెల్ఫీ వీడియోలో తెలిపింది. ఈ విషయం తెలిసి తన తల్లిదండ్రులు ఎంతో బాధపడుతున్నారని పేర్కొంది. అనంతరం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ మేరకు కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతి తీసుకున్న సెల్ఫీ వీడియో వైరల్‌గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version