సర్వే – జోస్యం: నీళ్లు చల్లుతున్న బాబు – పవన్!

-

ప్రస్తుతం ఏపీలో రెండు కామెంట్లు బాగా హల్ చల్ చేస్తున్నాయి. విచిత్రం ఏమిటంటే… ఆ రెండు కామెంట్లూ చేస్తున్నవారు.. ఇతర పార్టీలపై కాకుండా, సొంతపార్టీలపైనే విమర్శలు చేస్తున్నారు. స్వపక్షంలోనే విపక్షపాత్ర పోషిస్తున్నారు. అయితే విచిత్రం ఏమిటంటే… వీరిద్దరిలో ఏ ఒక్కరి కామెంట్ నిజమైనా… పవన్ కు ప్లస్ అవ్వాలి.. వీరిద్దరి కామెంట్లు రెండూ కరెక్టే అయినా కూడా పవన్ కే ప్లస్ అవ్వాలి? కానీ… ఆ టాపిక్కే రావడం లేదు ఎందుకో ఇప్పుడు చూద్దాం!

యువజనశ్రామికరైతు కాంగ్రెస్ ఎంపీ రఘురామకృష్ణంరాజు తాజాగా తాను చేయించాను అని చెప్పిన ఒక సర్వేపై స్పందించారు. ఆ సర్వే ప్రకారం ఇప్పుడు ఎన్నికలు జరిగితే వైకాపాకు 50సీట్ల కంటే ఎక్కువ రావని! అదే నిజమైతే… టీడీపీ అధికారంలోకి వస్తాదనే కదా అర్థం! అనుకుంటే… అంత సాహసం మాత్రం ఆర్.ఆర్.ఆర్. చేయలేదు! ఇక మిగిలింది జనసేనే కదా.. ఆ క్లారిటీ కూడా ఇవ్వలేదు!

ఇక తాజాగా టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి.. తన పార్టీపై స్పందించారు. ఇప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీ కచ్చితంగా ఓడిపోతుందని తెగేసి చెప్పారు. అంటే… వైకాపా మళ్లీ అధికారంలోకి వస్తుందనే కదా! కానీ.. ఆ మాట స్పష్టం చేయలేదు! పోనీ జనసేనకు ఛాన్స్ ఉంటుందా అంటే… ఆ ఊసే ఎత్తలేదు!

ఇలా అటు వైకాపాలో విపక్షం అయినా.. టీడీపీలో ముక్కుసూటిగా మాట్లాడే నేతలైనా.. టీడీపీ అధికారంలోకి రాదు – వైకాపా అధికారంలోకి రాదు అని చెబుతున్నారు. అందుకు ఒకరు సర్వేని నమ్ముకుంటే.. మరొకరు జోస్యాన్ని వెళ్లబుచ్చారు! మరి ఇప్పుడు ఈ రెండు పార్టీలు కాకుండా మరోపార్టీ కూడా ఏపీలో ఉంది. అదే జనసేన! వీరి సర్వే కానీ, వీరి జోస్యం కానీ… నిజమైతే కచ్చితంగా జనసేన అధికారంలోకి రావాలి మరి! అది జరిగే పనేనా… ఆ విషయం పవన్ కూడా స్పష్టంగా చెప్పలేని పరిస్థితి!

మరి వీరి సర్వేలు, జోస్యాలు… ఎవరి ఆత్మసంతృప్తి కోసం, ఎవరిని ఏమార్చడం కోసం? విచిత్రం ఏమిటంటే… వీరిద్దరి లక్ష్యము ఒకటే… చంద్రబాబు సీఎం అవ్వాలని – అంతకంటే ముందు జగన్ కు జనాల్లో వ్యతిరేకత పోగవ్వాలని! మరో విచిత్రం ఏమిటంటే… వీరి ఆశలు నెరవేర్చే పని చంద్రబాబు ఇప్పటివరకూ ఒక్కటికూడా చేయలేదు! తానూ రేసులో ఉన్నాననే కార్యక్రమం పవన్ ఇంకా చేపట్టలేదు!

Read more RELATED
Recommended to you

Exit mobile version