ఇండియా లో జరుగుతున్న వన్ డే వరల్డ్ కప్ అనంతరం ఆస్ట్రేలియా తో ఇండియా అయిదు టీ 20 ల సిరీస్ ను ఆడనుంది. నవంబర్ 23 నుండి మొదలు కానున్న ఈ సిరీస్ కు సారధిగా స్టార్ ప్లేయర్ సూర్య కుమార్ యాదవ్ ను నియమించాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే వరల్డ్ కప్ తర్వాత ఇండియా సీనియర్ ప్లేయర్లు అందరూ విశ్రాంతి తీసుకోనున్నారు, అందులో రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య, కోహ్లీ లు కూడా ఈ సిరీస్ కు దూరం అవుతారు. అందుకే సూర్య కు తన కాలిబర్ ఏమిటో నిరూపించుకునే అవకాశాన్ని టీం యాజమాన్యం కల్పించనుంది. దాదాపుగా అందరూ యువ ఆటగాళ్లు నిండిన ఈ జట్టును సూర్య కుమార్ ఏ విధంగా ముందుకు నడిపిస్తాడు అన్నది చూడాలి. అయితే ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.. బీసీసీఐ ఆదివారం వరల్డ్ కప్ ఫైనల్ ముగిసిన అనంతరం ప్రకటించడానికి ప్లాన్ చేస్తోంది.
ఒకవేళ సూర్యకు అవకాశం ఇస్తే సరిగ్గా వాడుకుంటాడా లేదా అన్నది చూడాలి. ఈ జట్టులో ఇషాన్ కిషన్, ప్రసిద్ధ కృష్ణ ఆడనున్నారు.