గతంలో నన్ను బాధ పెట్టారు.. ఈసారి అలా జరగొద్దు : సీఎం కేసీఆర్

-

ఎన్నికలు వచ్చాయంటే.. అడ్డగోలు జమాబందీలు జరుగుతుంటాయి. రాయి ఏదో.. రత్నం ఏదో ప్రజలు ఆలోచించుకోవాలని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ హుజూరాబాద్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంటలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి అన్యాయం చేసింది. ఎన్నిసార్లు అడిగినా తెలంగాణకు కొత్తగా ఒక్క నవోదయ పాఠశాలను గానీ, ఒక్క మెడికల్‌ కాలేజీని గానీ కేటాయించలేదు. మనకు ఒక్క స్కూల్‌ను, కాలేజీని ఇవ్వని బీజేపీకి ఒక్క ఓటు కూడా వేయవద్దు.

రాష్ట్రంలో మోటార్లకు మీటర్లు పెట్టనని తెగేసి చెప్పినందుకు మోడీ సర్కారు ఏటా రూ.5 వేల కోట్ల నిధుల కోత పెట్టింది. ఐదేళ్లలో రూ.25 వేల కోట్ల నిధులు నష్టపోయాం. అలాంటి బీజేపీకి మనం ఓటెందుకు వెయాలె. కౌశిక్‌ రెడ్డి వాళ్ల నాయిన.. ఈటల రాజేందర్‌ కూడా లేనినాడు తెలంగాణ ఉద్యమానికి గులాబీ జెండా మోసిన వ్యక్తి. ఇది మీ అందరికి గూడా తెలుసు. కౌశిక్‌రెడ్డి గెలిస్తే నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతది’ అని సీఎం చెప్పారు. గతంలో నన్ను ఒకసారి బాధ పెట్టారు.. ఈ సారి అలా జరగవద్దు. పాలు ఇచ్చే బర్రెను వదిలిపెట్టి ఎవ్వరైనా దున్నపోతును తెచ్చుకుంటారా..? కౌశిక్ రెడ్డికి ఓటు వేయండి.. హుజూరాబాద్ కి అండగా ఉంటానని తెలిపారు కేసీఆర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version