తెలంగాణాలో మరో పదమూడు రోజుల్లో ఎన్నికలు జరగనుండడంతో హామీలతో ప్రజలను రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఊదరగొడుతున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు కాంగ్రెస్ మరియు BRS లు తమ మానిఫెస్టో లను విడుదల చేయగా, బీజేపీ మాత్రం ఇంకా విడుదల చేయలేదు. కాగా తాజాగా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హైదరాబాద్ లోని కుత్బుల్లాపూర్ ప్రచారంలో మాట్లాడుతూ.. తెలంగాణాలో రానున్న ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే ఇంటి స్థలం లేని పేదలకు అందరికీ 60 లేదా 80 గజాల స్థలాలను ఇస్తామంటూ చెప్పారు. అంతే కాకుండా ఆ స్థలాలలో మళ్ళీ మేమే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కట్టిస్తామని ఈటల పేదలకు మాటిచ్చారు. ఒకసారి చూసుకుంటే కేసీఆర్ ఎప్పుడైనా పేదలకు భూములు ఇచ్చారా ? మరి పేదలు బాగా అలోచించి ఓటెయ్యాలంటూ చైతన్యవంతులను చేసే పనిలో ఉన్నారు ఈటల రాజేందర్. ఈ ఎన్నికలలో ఏ పార్టీ గెలుస్తుందో అటుంచితే హామీలు మాత్రం కొండను తాకుతున్నాయి.
అయితే కాంగ్రెస్ మరియు BRS లకు మాత్రమే ఈ ఎన్నికల్లో ప్రాధాన్యం ఉంటుంది.. బీజేపీ కేవలం నామమాత్రం అంటూ సర్వేలు కూడా చెబుతున్నాయి.