ఎట్టకేలకు ఫలితం దక్కించుకున్న సూర్య జై భీమ్..!!

-

తమిళ స్టార్ హీరో గా చలామణి అవుతున్న సూర్య ఏ సినిమా తీసినా సరే సమాజానికి ఏదో ఒక మెసేజ్ ఇస్తూ ఉంటాడు అని చెప్పడంలో సందేహం లేదు. ఇటీవల సూర్య జ్ఞానవేల్ దర్శకత్వంలో లాయర్ చంద్రు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఎంతటి ప్రేక్షకాదరణ పొందినదో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతోమంది అట్టడుగు పేద ప్రజలను ధనవంతులు మోసం చేస్తున్నవారిని.. ఒక్క రూపాయి కూడా ఫీజు తీసుకోకుండా లాయరు చంద్రు పేద వారి జీవితంలో ఎలాంటి వెలుగులు తీసుకొచ్చాడు అనే కథాంశంతో తెరకెక్కింది ఈ సినిమా. ఇక పోయిన సంవత్సరం నవంబర్ 2వ తేదీన అమెజాన్ ప్రైమ్ లో డైరెక్ట్ గా విడుదలైన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని కూడా సొంతం చేసుకుంది.కాకపోతే ఈ సినిమాలో నటించిన సూర్యాకు ఎంతో మంచి పాపులారిటీ కూడా వచ్చిందని చెప్పవచ్చు. ఇకపోతే సూర్య అద్భుతమైన నటనను కనబరిచినందుకు ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువే అని అనిపిస్తుంది. ఇదిలా ఉండగా ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో ఏకంగా ఆస్కార్ అవార్డు రేసులో కూడా నిలబడి అందరికీ సంతోషాన్ని కలుగ చేసింది. ఇక ఆస్కార్ రేసులో ఉన్నటువంటి ఈ సినిమా ఆస్కార్ అవార్డులను అందుకోలేకపోయినా ఇప్పటికీ ఎంతో ప్రతిష్టాత్మకమైన అవార్డులను సొంతం చేసుకుంది..

ముఖ్యంగా భారతదేశ సినీ పరిశ్రమలో అత్యంత గౌరవప్రదమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును జై భీమ్ చిత్రం సొంతం చేసుకుంది. ఏకంగా రెండు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులను సొంతం చేసుకోవడం గమనార్హం. ఉత్తమ చిత్రం ఉత్తమ సహాయ నటుడిగా ఈ సినిమాలో బాధితుడు పాత్రలో నటించిన మణికందన్ కి కూడా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చినట్లు ప్రకటించారు. తమ అభిమాన హీరో చిత్రం ఇలా ఉత్తమ పురస్కారం అందుకోవడం తో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version