సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న సమంత.. తన భర్త నాగచైతన్యతో విడాకులు తీసుకొని ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఆమెపై పలు రకాలుగా వార్తలు వినిపిస్తూ చాలా చర్చనీయాంశంగా మారింది. అయితే తరచుగా సమంత పెట్టె కొన్ని పోస్టులు నాగచైతన్య ను ఉద్దేశించి అని కొందరు భావిస్తూ ఉంటే ఆమె మాత్రం ఏదో ఒకటి యాదృచ్చికంగా పోస్ట్ పెడుతూ ఉందని మరికొంతమంది భావిస్తున్నారు. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక కొటేషన్ షేర్ చేసింది.
కొంతమంది ఆమె మీద దుష్ప్రచారం చేయడంతో ఆమె కోర్టు మెట్లు ఎక్కడం కూడా జరిగింది. కోర్టు కూడా సమంతాకు అనుకూలంగా తీర్పు ఇవ్వలేకపోయింది. ఇక కోర్టు సమంత తో నువ్వు పబ్లిక్గా పోస్టులు పెట్టడం మానేయాలని తెలియజేసింది. పలు యూట్యూబ్ ఛానల్ లో కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ నుంచి ఒక ఫోటో ని షేర్ చేసిన సమంత అందులో ఏమని రాసింది అంటే.. నిజాలు అనేది అరుదుగా బయటకు వస్తాయి కానీ ఎప్పుడూ అబద్ధాలే ప్రచారంలో ఉంటాయి.. అంతేకాదు అబద్ధాలని ఈ సమాజం ఎక్కువగా నమ్ముతుంది అని ఆమె పోస్ట్ చేసింది. ఒక హాలీవుడ్ సినిమా గురించి ఆమె కామెంట్లు చేయడం జరిగింది. కానీ ఈ విషయాన్ని మాత్రం నెటిజన్స్ తన పర్సనల్ లైఫ్ విషయాలతో లింక్ చేస్తున్నారు.