ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సూర్యపేట జాతీయ రహదారిని రైతులు నిర్భంధించారు. ఐకేపీలో కాంటాలు వేయట్లేదని రోడ్డెక్కి రైతులు నిరసన ప్రదర్శన చేపట్టారు. దీంతో భారీగా ట్రాఫిక్ జమ్ అయ్యింది. సూర్యాపేట మండలం రాజ్ నాయక్ తండాలో ఐకేపీలో కాంటాలు వేయట్లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
లారీలు రావట్లేదనే సాకుతో కాంటాలు ఆగినట్లు సమాచారం. ఐదు రోజులకు ఒక్క లారీ వస్తే ఎన్నిరోజులు కాంటాలు వేస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు. అకాల వర్షాలు, వడగండ్ల వానలోస్తే తమ పరిస్థితి ఏంటని రైతులు భయందోళన చెందుతున్నారు. వెంటనే కాంటాలు మొదలు పెట్టాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. రైతులు రహదారిపై బైఠాయించగా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.