గత పదేళ్లలో బీఆర్ఎస్ పాలనలో సామాజిక న్యాయం జరగలేదని ఎమ్మెల్సీ కవిత నిన్న మీడియా ముఖంగా ప్రకటించిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వంలో భూమి ఉన్న వారికి రైతు బంధు ఇచ్చామని.. కానీ, భూమి లేని వారి పరిస్థితి ఏంటని, వారి న్యాయం జరగలేదని కవిత చెప్పుకొచ్చారు.
తాజాగా ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యా స్పందించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ కవిత కళ్లు తెరిచి నిజం చెప్పినందుకు థ్యాంక్స్ అని అన్నారు. పదేళ్ల పాలన గురించి కవిత కళ్లు తెరిచి మాట్లాడటం సంతోషకరంగా ఉందని.. ఇప్పటికైనా ఆమె బయటికి వచ్చి ఇంకా కేసీఆర్, కేటీఆర్ చేసిన తప్పులు, అప్పులను బయట పెట్టాలని.. ఇప్పటికైనా తెలంగాణ ప్రజల రుణం తీర్చుకోవాలని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య వెల్లడించారు.