ఇంటర్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు రాష్ట్ర విద్యాశాఖ శుభావార్త చెప్పింది. డిగ్రీ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆన్‌లైన్ ప్రవేశాల కోసం ‘దోస్త్’ నోటిఫికేషన్ విడులైనట్లు ప్రకటించింది. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మా గాంధీ, శాతవాహన, జెఎన్‌టీయూహెచ్, వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీల్లో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ వంటి సంప్రదాయ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 3 విడతల్లో ప్రవేశాలను నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.అందుకోసం ‘దోస్త్’ వెబ్‌సైట్, మొబైల్ యాప్, మీసేవ యాప్, మీసేవ కేంద్రాలకు వెళ్లి అప్లయ్ చేసుకోవాలని విద్యార్థులకు అధికారులు సూచించారు.