పూల వనం‌లో టాలీవుడ్ యంగ్ హీరో..ఎవరి కోసమో?

-

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున మేనల్లుడు సుశాంత్ అనుమోలు..జీ.రవిచరణ్ రెడ్డి డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘‘కాళిదాసు’’ చిత్రం‌తో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఆ ఫిల్మ్ అనుకున్న స్థాయిలో ఆడలేదు. కానీ, సుశాంత్ నటనకు మంచి మార్కులే పడ్డాయని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత వచ్చిన చిత్రాలలో ‘కరెంట్, చిలసౌ’ మూవీస్ ప్రేక్షకులను అలరించాయి.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో తెరకెక్కిన ‘అల వైకుంఠపురములో’ సీనియర్ హీరోయిన్ తబు కొడుకుగా నటించి అందరి ప్రశంసలు పొందాడు. సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉండే సుశాంత్ ఇటీవల కాంలో సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ అయిపోయాడు.

ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ ఇచ్చేస్తున్నాడు. తన ఇన్ స్టా గ్రామ్ లో తాజాగా డిఫరెంట్ ఫొటోలు షేర్ చేశాడు. #MNT అనే క్యాప్షన్ తో పూల వనంలో కూల్ గా అలా నిలిచొని ఉన్న ఫొటోలు షేర్ చేశాడు. సదరు ఫొటోలో కూల్ గా స్మైల్ ఇస్తున్నాడు అక్కినేని వారి యంగ్ హీరో.

సదరు ఫొటో చూసి నెటిజన్లు ‘‘గుడ్ నేచర్ లవర్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్’’అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సుశాంత్ సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రవితేజ ‘రావణాసుర’ చిత్రంతో పాటు ‘వరుడు కావలెను’ ఫేమ్ లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో జీ5 ఒరిజినల్ #MNT లో నటిస్తున్నాడు. ఈ #MNT తోనే సుశాంత్ డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version