ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి పరమాన్నం పెడతామని.. అధికారంలోకి వచ్చిన తరువాత పంగనామాలు పెడుతున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలలో మొదటి హామీ మహాలక్ష్మీ అమలు కాలేదని.. చివరి హామీ చేయూత వృద్ధులకు, వితంతువులకు రూ.4వేల పెన్షన్ అమలు కాలేదని ఆరోపించారు.
అంతేకాదు.. మధ్యలో ఉన్న హామీలకు కొర్రీలు పెడుతున్నారని, రైతు భరోసా, రేషన్ కార్డులు, వ్యవసాయ కూలీలు, ఇందిరమ్మ ఇళ్లలో కోతలు పెడుతున్నారని చెప్పారు. అలాగే రేషన్ కార్డులకు,
కుల గణనకు ముడి పెట్టడం ఏంటని, ప్రజపాలనలో తీసుకున్న దరఖాస్తులు, మీ సేవల తీసుకున్న దరఖాస్తులు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. అంతేగా రేషన్ కార్డులకు ఆదాయయ పరిమితి పెంచాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుందని అన్నారు. ఆ రోజు కేసీఆర్ మానవతా దృక్పథంతో పెంచారని, కేసీఆర్ ది పేదలకు అందాలనే ఆలోచన అయితే.. రేవంత్ రెడ్డి పేదలకు కోతలు విధించాలనే ఆలోచన అని, ఇద్దరికీ ఇదే తేడా అని చెప్పారు. ఇక ఈ నెల 21 వ తేదీ నుంచి
గ్రామల్లో గ్రామ సభలు నడుస్తాయని, ప్రజలు రేషన్ కార్డులపై కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని
పిలుపునిచ్చారు.