స్వచ్ఛభారత్ ప్రోగ్రామ్.. వారిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సీరియస్

-

స్వచ్ఛభారత్ కేవలం ప్రభుత్వ కార్యక్రమం కాదని, ఇది ఒక ప్రజా ఉద్యమం అని కేంద్రమంత్రి,బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. దేశ ప్రజలందరీ సహకారంతోనే దేశంలో స్వచ్ఛత సాధ్యం అవుతుందని తెలిపారు. మహాత్మగాంధీ జయంతి సందర్భంగా కిషన్ రెడ్డి బుధవారం సికింద్రాబాద్‌లోని ఎంజీ రోడ్డులో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు.అందులో భాగమై స్థానికులతో కలిసి రోడ్లను శుభ్రం చేశారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ..గతంలో స్వచ్ఛత విషయంలో ప్రజల భాగస్వామ్యం లేదని, అందువల్లే ప్రభుత్వం, పారిశుద్ధ్య కార్మికులు ఎంత కష్టపడినా ఫలితం లేకుండా పోయిందన్నారు.

అందుకే ప్రధాని మోడీ పదేళ్ల కిందట ప్రజలను భాగస్వామ్యం చేస్తూ స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. దీంతో దేశంలో పరిసరాల పరిశుభ్రతపై అవగాహన పెరిగిందన్నారు.కోట్లాది మంది ప్రజలకు హాస్పిటల్ ఖర్చు తగ్గిందని గుర్తుచేశారు. కొందరు చదువుకున్న వారు, అపార్ట్‌మెంట్లలో ఉండేవారు చెత్తను కవర్లలో చుట్టి రోడ్లపై పారబోస్తున్నారని, ఇది చాలా దుర్మార్గం అని విమర్శించారు.స్వచ్ఛభారత్ అనేది ఒక రోజు కార్యక్రమం కాదని..వ్యక్తిగతంగా ఎవరికి వారు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు కృషి చేయాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version