హైడ్రా భయంతో గుండెపోటుతో మరో వ్యక్తి మృతి !

-

హైడ్రా కూల్చివేతల భయంతో హైదరాబాద్‌ ప్రజలు వణికిపోతున్నారు. తాజాగా హైడ్రా కూల్చివేతల భయంతో గుండెపోటుతో వ్యక్తి మృతి చెందడం జరిగింది. ఈ సంఘటన బుధవారం చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. అంబర్‌పేట్ నియోజకవర్గం తులసీరాం నగర్లో మూసీ కూల్చివేతల భయంతో రెండు రోజులుగా భయపడుతున్న గంధశ్రీకుమార్ (55) అనే వ్యక్తి గుండెపోటుతో ఈ రోజు ఉదయం మరణించడం జరిగింది.

Another person died of heart attack due to fear of hydra

ఇక కుమార్‌కు ఇప్పటికే భార్య చనిపోగా ముగ్గురు పిల్లలు ఉన్నారని సమాచారం. దీనిపై పోలీసులు కేసు.. నమోదు చేసుకుని…దర్యాప్తు చేస్తున్నారు. ఇక అటు హైడ్రాకు హై పవర్స్ వచ్చేశాయి. హైడ్రా ఆర్డినెన్స్ కు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇకపై హైడ్రాకు ప్రత్యేక చట్టం అమలులోకి రానుంది. మున్సిపల్ చట్టంలో 374B సెక్షన్ చేరుస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ORR పరిధి వరకు ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, నాలాలు పరిరక్షిస్తూ సర్వాధికారాలు ఇచ్చేలా చట్టం రూపకల్పన చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version