కేరళ గోల్డ్ స్కాం నిందితులకు బెయిల్

-

కేరళ గోల్డ్ స్కాంలో కీలక సూత్రదారి స్వప్న సురేశ్ బెయిల్ పిటిషన్‌ పై తాజాగా కొచ్చి సెషన్స్ కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో ఇరువురి వాదనలు వాదనలు విన్న అనంతరం కొచ్చి సెషన్స్ కోర్టు స్వప్న సురేశ్‌కు బెయిల్ మంజూరు చేసింది. గోల్డ్ స్కాం దర్యాప్తు చేస్తున్న ఈడీ స్వప్న సురేష్ మీద మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ఈ కేసులోనే ఆమెకు బెయిల్‌ ఇచ్చింది సెషన్స్ కోర్టు.

 సంచలనం సృష్టించిన గోల్డ్ స్మగ్లింగ్ స్కాంలో కస్టమ్స్‌, ఈడీ, ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తున్నాయి. ఈ మూడు సంస్థలు వేర్వేరుగా నిందితులపై కేసు నమోదు చేశాయి. ఈడీ కేసులో బెయిల్‌ లభించినా ఎన్ఐఏ కేసులో అరెస్టు కావడంతో మరికొన్ని రోజులు జైల్లో ఉండనున్నారు స్వప్న. ఇప్పటికే స్వప్నకి కేసులోనూ బెయిల్‌ వచ్చింది. కానీ ఎన్‌ఐఏ కేసులో బెయిల్ పిటిషన్‌ పెండింగ్‌లో ఉంది. ఒకవేళ ఆమెకు ఈ కేసులో కూడా బెయిల్ లభిస్తే ఆమె బయటికి వచ్చే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version