గత మూడు రోజులుగా ఎడతెరపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నాయి..ఇటు గ్రేటర్ హైదరాబాద్ పూర్తిగా జల దిగ్భంధంలోనే ఉంది..మరో వైపు మరో రెండు రోజులు కూడా భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికలతో అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం బుధవారం, గురువారం ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు సెలవు ప్రకటించింది..స్కూళ్లు,కాలేజీల ఆన్ లైన్ క్లాస్‌లను కూడా రద్దు చేశారు..ఉస్మానియా వర్సీటి ఈ రోజు నిర్వహించే అన్ని పరీక్షలను వాయిదా వేసింది.. కాగా, రాగ 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో వార్డు అధికారులు కార్యాలయాల్లో అందుబాటులో ఉండి వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని జీహెఎంసీ కమిషనర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు..ఇటు పోలీసు సిబ్బంది కూడా సహయక చర్యల్లో పాల్గొనాలని డీజీపీ పోలీస్ అధికారుల ఆదేశించాడు.