బిగ్ బాస్ సీజన్-3 ప్రారంభానికి సమయం దగ్గర పడింది. ఇప్పటికే నాగార్జున హోస్ట్ గా షో ఖరారైంది. కంటెస్టెంట్లు ఫైనల్ అయ్యారు. అయితే టెలికాస్ట్ కు టైం దగ్గర పడటంతో బిగ్ బాస్ గురించి ఆసక్తికర ఆరోపణలు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ లోకి ఎంటర్ అవ్వాలంటే కచ్చితంగా కమిట్ మెంట్ ఇవ్వాలని అడుగున్నారుట. వాస్తవానికి ఈ ఆరోపణలు సీజన్-1 నుంచి వినిపిస్తున్నాయి. కానీ వాటికి సరైన ఆధారాలు దొరకలేదు. తాజాగా బిగ్ బాస్ చీకటి కోణం గురించి యూ ట్యూబ్ యాంకర్ శ్వేతారెడ్డి సంచలన ఆరోపణలు చేసింది. తన పని తానేదో చేసుకుంటోన్న శ్వేతకి బిగ్ బాస్ నిర్వాహకులు ఫోన్ చేసి కంటెస్టెంట్ గా తీసుకుంటామని చెప్పారుట.
ఈ నేపథ్యంలో దఫదఫాలు బిగ్ బాస్ నిర్వాహకులతో సమావేశాలకు హాజరైంది. చివరిగా ఆమెను ఎంపిక చేస్తూ అగ్రిమెంట్ కూడా చేసుకున్నారుట. అనంతరం శ్యామ్ అనే కో ఆర్డినేటర్ మిమ్మల్ని తీసుకుంటే మాకు ఏం లాభం ? బిగ్ బాస్ షో హిట్ అవ్వాలంటే ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారు? ఆ మాటల మధ్యలోనే మా బాస్ ను ఎలా ఇంప్రెస్ చేస్తారు? వంటి ప్రశ్నలు అడిగాడుట. దీంతో శ్వేతారెడ్డి మీ బాస్ ను నెనెందుకు ఇంప్రెస్ చేయాలి? అలా అడగడం వెనుక దాని అర్ధం ఏంటి? నానుంచి ఏమి ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు? కమిట్ మెంట్ అడుగుతున్నారా? హి విల్ యూ సెట్ స్పై మై బాస్ అంటారా? అంటూ చెడామడా వాయించేసిందిట. జర్నలిస్ట్ గా ఎంతో మందిని ఇంటర్వూలు చేసాను.