ఓరి నాయనో.. గుర్రం పై ఫుడ్ డెలివరీ.. ఎక్కడో తెలుసా?

-

ఒకప్పుడు కడుపు కాలితే శుభ్రంగా వండుకొని తినే వాళ్ళు .. కానీ ఇప్పుడు ఫుడ్ డెలివరీ యాప్ పుణ్యమా అని ఇప్పుడు వండే వాళ్ళు తక్కువ అయ్యారు.ఏదైనా రుచిగా తినాలి అంటే మాత్రం ఏదొక రెస్టారెంట్ కు ఆర్డర్ పెడితే రుచికరమైన వంట నిమిషాలకే మన ముందుకు వస్తుంది..ఈ బద్ధకమే ఆ కంపెనీస్‌కు మంచి బిజినెస్ తెచ్చి పెడుతోంది. సిటీల్లో అయితే ఫుడ్ డెలివరీ బాయ్స్‌కి క్షణం తీరిక దొరకట్లేదంటే ఏ స్థాయిలో ఆర్డర్లు వస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ డిమాండ్‌కు తగ్గట్టుగానే కంపెనీలు వాళ్లకు ఆ బాయ్స్‌కి ఇన్‌సెంటివ్స్ ఇస్తూ ప్రోత్సహిస్తోంది.

ఫలానా టైమ్‌లోగా వెళ్లి ఆర్డర్ అందిస్తే వాళ్లకి మంచి రేటింగ్‌ కూడా వస్తుంది. అందుకే ఇన్‌టైమ్‌లో ఆర్డర్ ఇచ్చేందుకు వాళ్లు పడరాని పాట్లు పడుతుంటారు. ఇప్పుడు ముంబయిలోనూ ఓ స్విగ్గీ డెలివరీ బాయ్ ఇలా చేసే వార్తల్లోకెక్కాడు. భారీ వర్షం పడుతున్నా, లెక్క చేయకుండా ఫుడ్‌ను డెలివరీ చేసేందుకు చాలా వేగంగా వెళ్లిపోయాడు.అంత భారీ వర్షం లో ఎలా వెళ్ళాడు అనే సందేహం వస్తుంది కదూ..కాస్త ఆగండి..

గుర్రంపైన. అవును గుర్రపుస్వారీ చేస్తూ ఆ వర్షంలో తడుస్తూ కనిపించాడు..డెలివరీ బాయ్. ఇదంతా ఓ వ్యక్తి తన కార్‌లో నుంచి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అప్పటి నుంచి ఇది నెట్టింట గుర్రం కన్నా వేగంగా చక్కర్లు కొడుతోంది..గుర్రం పైన డెలివరీ ఇవ్వాలనె ఆలోచన రావడం నిజంగా గ్రేట్ అంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు.. ఆ వీడియో ను మీరు చూసెయ్యండి..

Read more RELATED
Recommended to you

Exit mobile version