సూపర్ రిజల్ట్: టీ 20 చరిత్రలో థాయ్ లాండ్ వరల్డ్ రికార్డ్ !

-

మహిళల క్రికెట్ జట్లు మలేసియా మరియు థాయ్ లాండ్ లు ఈ రోజు టీ 20 మ్యాచ్ లో తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన థాయ్ లాండ్ జట్టి 18.3 ఓవర్ లలోనే 53 పరుగులకు ఆల్ ఔట్ అయింది. ఎవరైనా ఇంత సల్ప స్కోర్ ను చూసి ఏమనుకుంటారు ఖచ్చితంగా ఓటమి తప్పదు అని… కానీ ఇక్కడ అద్భుతమే జరిగింది. థాయ్ లాండ్ బౌలర్లు లక్ష్యం చిన్నదిగా ఉంది… డిపెండ్ చేయగలమా లేదా అన్నది ఆలోచించలేదు. కచ్చితంగా ఆఖరి రన్ వరకు పోరాడాలి అన్న స్పూర్తితో బౌలింగ్ కు వెళ్ళింది. అనుకున్న విధంగానే మలేసియా జట్టును కేవలం 41 పరుగులకే పరిమితం చేసి ఆల్ ఔట్ చేసింది.

ఇది కూడా 15.3 ఓవర్లకే ఇన్నింగ్స్ ను ముగించడం విశేషం. దీనితో ప్రపంచంలో ఇప్పటి వరకు నమోదు అవ్వని రికార్డును సెట్ చేశారు థాయ్ లాండ్ మహిళల క్రికెట్ జట్టు. అంతకు ముందు 2012 లో శ్రీలంక మరియు బంగ్లాదేశ్ మహిళల మధ్య జరిగిన టీ 20 మ్యాచ్ లో … బంగ్లా మొదటి బ్యాటింగ్ లో 62 పరుగులు చేయగా అనంతరం శ్రీలంకను 62 పరుగుల లోపు కట్టడి చేసి విజయాన్ని అందుకుంది.. ఇప్పుడు ఈ రికార్డును థాయ్ లాండ్ మహిళలు క్రాస్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version