ఐపిఎల్ 2023: ప్చ్… మళ్లీ ఓడిన SRH… కెప్టెన్ వలనే ఈ దారుణ ఓటమి!

-

ఐపిఎల్ లో ఈ రోజు హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం లో కోల్కతా మరియు హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో కోల్కతా 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆఖరి బంతి వరకు గెలుపు ఓటముల మధ్య దోబూచులాట జరిగింది. చివరికి మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అద్భుతంగా బౌలింగ్ చేయడంతో కోల్కతా గెలిచి ఊపిరి పీల్చుకుంది. మొదటి 10 ఓవర్లు మాత్రమే కోల్కతా వైపు మ్యాచ్ ఉంది, ఆ తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ ను మార్ క్రామ్ మరియు క్లాజెన్ లు దాదాపు జట్టును గెలిపించినంత పని చేశారు… కానీ వరుసగా క్లజెన్ మరియు మార్ క్రామ్ వికెట్లు కోల్పోయి మ్యాచ్ ను టైట్ చేసింది.

ముఖ్యంగా కెప్టెన్ మార్ క్రామ్ అనవసర షాట్ కు ప్రయత్నించి ఔట్ అయ్యారు. కొంచెం సహనం పాటించి ఉంటే ఖచ్చితంగా గెలుపు హైదరాబాద్ కే దక్కేది. ఈ మ్యాచ్ లో గెలుపును చేజేతులా పోగొట్టుకున్న హైదరాబాద్ జట్టు ఒక దాదాపుగా ప్లే ఆప్స్ కు చేరడం కష్టమే అని చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version