బ్రేకింగ్: పాస్ పుస్తకం ఇవ్వలేదని పెట్రోల్ పోసి ఆఫీసులోనే తహశీల్దార్ దారుణ హత్య

-

రంగారెడ్డి జిల్లాలో సురేష్ అనే రైతు దారుణానికి ఒడిగట్టాడు. తహసిల్దార్ పై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. వివరాల్లోకి వెళితే సోమవారం మధ్యాహ్నం తహసిల్దార్ ఆఫీస్ కి వచ్చిన సురేష్ అనే రైతు తహసిల్దార్ విజయారెడ్డి తో మాట్లాడాలని లోపలి వెళ్ళే ప్రయత్నం చేయగా అక్కడ ఉన్న సిబ్బంది అతన్ని అడ్డుకున్నారు. కాసేపటి తర్వాత లోపలి వెళ్ళిన సురేష్ ఆమెతో దాదాపు అరగంట సేపు మాట్లాడాడు. ఈ సమయంలోనే ఆమెపై అతను దాడికి దిగాడు. ఎవరూ లేని సమయంలో లోపలి వెళ్ళిన సురేష్ ఆమె ఛాంబర్ తలుపులు మూసేసాడు.

ఆమెపై భౌతికంగా దాడి చేసిన అనంతరం పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. ఆ వెంటనే తనపై కూడా పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకున్న సురేష్… చొక్కా విప్పేసి బయటకు పరుగులు తీసాడు. అక్కడి నుంచి విజయారెడ్డి కారిడార్ లోకి మంటలతో అరుస్తూ పరుగులు తీసారు. అక్కడే ఉన్న ఆమె డ్రైవర్ ఆమెను కాపాడే ప్రయత్నం చేయగా పెట్రోల్ కావడంతో మంటలు అదుపులోకి రాలేదు. ఎమ్మార్వో విజయారెడ్డి పూర్తిగా కాలిపోయి… తన కార్యాలయంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఆమెకు అంటుకున్న మంటలను అదుపు చేయడానికి అక్కడి వారు ప్రయత్నించినా…

అదుపులోకి రాకపోగా ప్రయత్నించిన ఇద్దరికీ తీవ్ర గాయలు అయ్యాయి. వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక ఈ ఘటనకు ప్రధాన కారణం ఆమె మండలం తుర్కయంజాల్‌ గ్రామంలో ఉన్న ఓ భూమికి సంబంధించిన పాస్‌బుక్‌ ఎమ్మార్వో కార్యాలయం చుట్టూ తిరుగుతున్న ఎమ్మార్వో స్పందించటం లేదని అందుకే రైతు ఈ దారుణానికి ఓడిగాట్టాడని పోలీసులు తెలిపారు. తనపై పెట్రోల్ పోసుకున్న సురేష్ తీవ్రంగా గాయపడగా అతన్ని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version