ఫైనల్ వర్డ్: మీ పని మీరు చూసుకోండి… బాబుకు దిమ్మతిరిగే కౌంటర్!

-

ఆంధ్రప్రదేశ్ మాన్సాస్ ట్రస్టు చైర్ పర్సన్ సంచయిత గజపతి… మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఒంటికాలిపై లెగుస్తున్నారు. గతంలో బాబు సంచయితను కదిలించుకొని తిట్టుంచుకున్నారు అని అంతా భావించారు. కానీ… ఈసారి కూడా చంద్రబాబు అదే చేశారని ముఖ్యంగా తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు. తాజాగా అనంత పద్మనాభస్వామి ఆలయ పాలన హక్కులు ట్రావెన్ కోర్ రాజకుటుంబానికే చెందుతాయంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ట్వీట్ చేస్తూ, ఏపీలో సింహాచలం బోర్డు, మాన్సాస్ ట్రస్టు సంరక్షకులుగా గజపతి కుటుంబీకుల హక్కులను కాపాడాల్సి ఉందని పేర్కొన్నారు. దీనిపై మాన్సాస్ ట్రస్టు చైర్ పర్సన్ సంచయిత గజపతి వెంటనే తగిన రీతిలో ధీటైన జవాబిచ్చారు.

అదేమంటే… “నన్ను చైర్ పర్సన్ గా నియమించడం వల్ల సింహాచలం, మాన్సాస్ ట్రస్టులపై గజపతి కుటుంబ హక్కులు పూర్తిగా సంరక్షింపబడుతున్నాయి చంద్రబాబు గారూ” అంటూ కౌంటర్ ఇచ్చారు. అంతటితో ఆగకుండా “నేను సంచయిత గజపతిని, నా తండ్రి ఆనంద గజపతికి అన్ని విధాలా న్యాయపరమైన వారసురాలిని. మా తాతగారైన మహారాజా పీవీజీ రాజుగారికి మా తండ్రి ఆనంద గజపతి న్యాయపరమైన వారసుడు, మా తండ్రి ఆనంద గజపతికి నేను వారసురాలిని. చంద్రబాబు గారూ… గజపతి కుటుంబం మొత్తానికి తానే వారసుడ్నని చెప్పుకుంటూ అహంభావం చూపుతున్న అశోక్ గజపతిలా కాకుండా, మీరు లింగ సమానత్వంపై గౌరవం చూపుతారని భావిస్తున్నాను” అంటూ సంచియిత గజపతి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చేసింది.

అంతటితో ఆగకుండా “నేను గజపతి కుటుంబానికి చెందిన దాన్నే కాదంటూ అశోక్ గజపతి మిమ్మల్ని తప్పుదోవ పట్టించాడు. ఈ వ్యవహారాలను రాజకీయం చేయకుండా, గజపతి కుటుంబ వ్యవహారాల్లో మీరు జోక్యం చేసుకోకుండా ఉంటే మిమ్మల్ని తప్పకుండా అభినందిస్తాను” అంటూ సంచయిత ట్విట్టర్ లో స్పందించారు. మొత్తానికి చంద్రబాబుపై సంచయిత అవకాశం వచ్చినప్పుడంతా ఘాటుగా స్పందిస్తుండటం తెలుగు తమ్ముళ్లనే కాకుండా వైసీపీ క్యాడర్ కు కూడా మంచి కిక్కించేలా అనిపించేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అదంతే..!!

Read more RELATED
Recommended to you

Exit mobile version