ఇమ్యూనిటీ, ఎముకల ఆరోగ్యం కోసం ఈ సూపర్ ఫుడ్స్ ని తీసుకోండి..!

-

మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. చలికాలంలో ఈ ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. ఇమ్యూనిటి పెరుగుతుంది. అలాగే ఎముకల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అయితే చలికాలంలో ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి అనేది చూద్దాం. వీటిని తీసుకుంటే ఇబ్బందులు ఉండవు. పైగా చాలా సమస్యల నుండి బయట పడచ్చు. మరి ఇక ఆలస్యం ఎందుకు వాటి కోసం చూద్దాం.

సజ్జలు:

సజ్జలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇందులో విటమిన్ డి ఉంటుంది. సజ్జలతో లడ్డూలను తయారు చేసుకుంటూ ఉంటారు. వీటిని తీసుకోవడం వల్ల ఎముకల ఆరోగ్యం కూడా బాగుంటుంది. అలానే చాలా సమస్యలు కూడా ఉండవు.

కూరగాయలు:

కూరగాయలు కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా పచ్చగా ఉండే కూరగాయలు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది. వీటిలో ఫైబర్, విటమిన్స్ సమృద్ధిగా ఉంటాయి.

సీజనల్ ఫ్రూట్స్:

జామ, సీతాఫలం, ఆపిల్ వంటి వాటిని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. వీటిని తీసుకోవడం వల్ల కూడా ఆరోగ్యం చాలా బాగుంటుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది అలానే ఎముకలు కూడా దృఢంగా ఉంటాయి.

నువ్వులు:

నువ్వులు వలన కూడా ఆరోగ్యం బాగుంటుంది. నువ్వులతో లడ్డూ, చట్నీ తయారు చేసుకుని తీసుకోవచ్చు.

పల్లీలు:

పల్లీలు తీసుకోవడం వల్ల కూడా ఆరోగ్యం బాగుంటుంది వీటిలో విటమిన్ డి, ఈ, ఏ, పాలీఫెనాల్స్ వంటివి ఉంటాయి. గుండె ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిది.

నెయ్యి:

నెయ్యి ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు నెయ్యిలో విటమిన్స్ సమృద్ధిగా ఉంటాయి. ఈ ఆహార పదార్థాలను చలికాలంలో ఎక్కువగా తీసుకోండి. దాంతో సమస్యలు తొలగిపోతాయి. అదే విధంగా ఆరోగ్యంగా ఉండొచ్చు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version