అమరావతి : ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్నయం తీసుకుంది. ఇవాళ్టీ నుంచి నాలుగు రోజుల పాటు జిల్లాల విభజనపై కలెక్టర్లతో సమావేశాలు నిర్వహించనుంది ప్రణాళిక శాఖ. ఈ సందర్భంగా… జిల్లాల విభజనపై సలహాలు, సూచనలు, అభ్యంతరాలపై చర్చ నిర్వహించనున్నారు అధికారులు.
ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో అభ్యంతరాలు, కొత్త డిమాండ్లతో కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పిస్తున్నారు వివిధ పార్టీల ‘ప్రతినిధులు. విజయవాడ, తిరుపతి, అనంతపురం, విశాఖల్లో వివిధ జిల్లాల కలెక్టర్లతో భేటీ కానున్న ప్రణాళిక శాఖ… ఇవాళ విజయవాడలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహించనున్నారు.
ఇక రేపు తిరుపతిలో చిత్తూరు, నెల్లూరు, కడప కలెక్టర్లతో భేటీ కానున్నారు. ఈ నెల 25 వ తేదీన అనంతపురంలో అనంత, కర్నూలు కలెక్టర్లతో సమావేశం కానున్నారు అధికారులు. ఈ నెల 26 వ తేదీన విశాఖలో ఉత్తరాంధ్ర, తూ.గో జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహించనున్నారు.