ప‌ర్స‌న‌ల్ లోన్‌కు అప్లై చేస్తున్నారా..? త‌క్కువ వ‌డ్డీ రేట్లు ఇస్తున్న బ్యాంకుల వివ‌రాలివే..!

-

కరోనా వైర‌స్ ప్ర‌జ‌ల జీవితాల‌ను చిన్నాభిన్నం చేసింది. అనేక మంది ఉద్యోగాల‌ను కోల్పోయి ఆర్థిక స‌మ‌స్య‌ల్లో చిక్కుకున్నారు. మ‌రోవైపు అనారోగ్య స‌మ‌స్య‌లకు చికిత్స చేయించుకునేందుకు డ‌బ్బు కావ‌ల్సి వ‌స్తోంది. దీనికి తోడు నెల నెలా ఉండే ఖ‌ర్చులు.. వెర‌సి.. స‌గ‌టు పౌరుడిని ఆర్థిక స‌మ‌స్య‌లు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అయితే అలాంటి వారి కోసం ప‌లు బ్యాంకులు త‌క్కువ వ‌డ్డీకే వ్య‌క్తిగ‌త రుణాల‌ను అందిస్తున్నాయి. ఆయా బ్యాంకుల వివరాలు ఇలా ఉన్నాయి.

* ఇండియ‌న్ బ్యాంక్ వారు ఐబీ క్లీన్ లోన్ స్కీంలో భాగంగా 9.20 శాతం వ‌డ్డీతో వ్య‌క్తిగ‌త రుణం ఇస్తున్నారు.

* ఐడీఎఫ్‌సీ బ్యాంకులో 9.20 శాతం వ‌డ్డీ రేటుతో ప‌ర్స‌న‌ల్ లోన్ తీసుకోవ‌చ్చు.

* ఎస్‌బీఐలో ఎక్స్‌ప్రెస్ లైట్ స్కీం కింద 9.60 శాతం వ‌డ్డీతో రుణం ఇస్తున్నారు.

* పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకులో ప‌ర్స‌న‌ల్ లోన్ స్కీం ఫ‌ర్ ప‌బ్లిక్‌లో భాగంగా 9.65 శాతం వ‌డ్డీ రేటుతో రుణం పొంద‌వ‌చ్చు.

* సెంట్ర‌ల్ బ్యాంకులో సెంట్ ప‌ర్స‌న‌ల్ లోన్ స్కీం కింద 9.85 శాతం వ‌డ్డీ రేటుతో రుణం పొంద‌వ‌చ్చు.

* సిటీ బ్యాంకులో 9.99 శాతం వ‌డ్డీ రేట‌తో ప‌ర్స‌న‌ల్ లోన్ ఇస్తున్నారు.

* యూకో బ్యాంకులో యూకో క్యాష్ స్కీంలో భాగంగా 10.05 శాతం వ‌డ్డీరేటుతో ప‌ర్స‌న‌ల్ లోన్ తీసుకోవ‌చ్చు.

* సౌత్ ఇండియ‌న్ బ్యాంకులో ఎస్ఐబీ ప‌ర్స‌న‌ల్ లోన్స్ స్కీమ్‌లో 10.05 శాతం వ‌డ్డీతో రుణం పొంద‌వ‌చ్చు.

* బ్యాంక్ ఆఫ్ బ‌రోడా, హెచ్ఎస్‌బీసీ బ్యాంకుల్లో 10.50 శాతం వ‌డ్డీ రేటుతో ప‌ర్స‌న‌ల్ లోన్ పొంద‌వ‌చ్చు.

అయితే వ‌డ్డీ రేటు త‌క్కువ‌గా ఉండే బ్యాంకులు ప్రాసెసింగ్ ఫీజు, ఇత‌ర చార్జీల‌ను ఎక్కువ‌గా తీసుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. అలాగే లోన్ కాల‌ప‌రిమితి కూడా ఎక్కువ‌గా ఉంటుంది. క‌నుక ఈ అంశాల‌ను కూడా ఒక్క‌సారి గ‌మ‌నించి రుణాల‌ను పొంద‌డం మంచిది.

Read more RELATED
Recommended to you

Exit mobile version