బాగ్‌లింగంపల్లి అగ్నిప్రమాద ఘటనాస్థలిని పరిశీలించిన తలసాని

-

హైదరాబాద్ బాగ్​లింగంపల్లిలోని ఓ డెకరేషన్ సామగ్రి గోదాంలో అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాద స్థలికి రాష్ట్ర మంత్రి తలసాని చేరుకున్నారు. ఘటనాస్థలిని పరిశీలించారు. ప్రమాదంపై అగ్నిమాపక సిబ్బందిని ఆరా తీశారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ మంత్రి తలసాని.. ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన గోదాముల్లో జాగ్రత్తలు తీసుకోని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పురాతన గోదాములు, భవనాలు గుర్తించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు.

అసలేం జరిగిందంటే..?

నగరంలోని బాగ్‌లింగంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బాగ్‌లింగంపల్లి వీఎస్టీ సమీపంలోని గోదాములో అగ్ని ప్రమాదం సంభవించి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. శుభకార్యాలకు ఉపయోగించే డెకరేషన్‌ సామగ్రి మంటల్లో కాలి బూడిదయ్యాయి. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పుతున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన గోదాము పరిసర ప్రాంతాల్లో బస్తీలు ఉండడంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version