తలసాని వారసుడికి మళ్ళీ ఛాన్స్ ఉందా?

-

వారసత్వ రాజకీయం…ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త అంశం ఏమి కాదు..ప్రతి నాయకుడు తమ వారసుడుని రాజకీయాల్లోకి తీసుకురావడం సహజమే..అలాగే తమ వారసులని రాజకీయంగా సక్సెస్ చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే అనేక మంది వారసులు రాజకీయాల్లోకి వచ్చారు..సక్సెస్ అయ్యారు. ఇంకా చెప్పాలంటే దివంగత వైఎస్సార్ వారసుడుగా జగన్, చంద్రబాబు వారసుడుగా లోకేష్, కేసీఆర్ వారసుడుగా కేటీఆర్ రాజకీయం నడిపిస్తున్న విషయం తెలిసిందే.

ఇక వీరే బాటలోనే అనేక మంది నేతల వారసులు రాజకీయాల్లోకి వచ్చారు..అటు ఏపీ, ఇటు తెలంగాణలో ఈ వారసత్వ రాజకీయం ఎక్కువగానే నడుస్తుంది. గత ఎన్నికల్లోనే చాలామంది నేతల వారసులు ఎన్నికల బరిలో దిగిన విషయం తెలిసిందే. అప్పుడు కొంతమంది నేతల సక్సెస్ అవ్వగా, కొంతమంది ఫెయిల్ అయ్యారు. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో కూడా కొందరు నేతల వారసులు ఫెయిల్ అయ్యారు.

అయితే ఈ సారి సక్సెస్ అవ్వాలని కసితో వారసులు పనిచేస్తున్నారు..అలా సక్సెస్ కోసం పనిచేస్తున్న వారిలో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు సాయి కిరణ్ యాదవ్ ముందు వరుసలో ఉన్నారని చెప్పొచ్చు. రాజకీయంగా తలసాని సక్సెస్ ఫుల్ లీడర్…ఇక తనకు లాగానే తన తనయుడుని కూడా సక్సెస్ చేయాలని చెప్పి రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. గత ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీ సీటు దక్కించుకున్నారు కూడా. దీంతో సాయి కిరణ్…సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు…అది బీజేపీ దిగ్గజ లీడర్ కిషన్ రెడ్డిపై పోటీ చేశారు. అయితే 2019 ఎన్నికల్లో మోడీ వేవ్…అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన సానుభూతి కిషన్ రెడ్డికి పనిచేసింది..దీంతో సికింద్రాబాద్ బరిలో తలసాని వారసుడు ఓటమి పాలయ్యారు.

అయితే ఈ సారి కూడా సికింద్రాబాద్ ఎంపీ సీటు దక్కించుకుని, మళ్ళీ అక్కడే బరిలో దిగి గెలవాలని చూస్తున్నారు. ఓడిన దగ్గర నుంచి పార్లమెంట్ స్థానంలో పనిచేస్తూనే ఉన్నారు..పార్లమెంట్ పరిధిలో ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సఖ్యతగా ఉంటూ ముందుకెళుతున్నారు. ఎలాగైనా ఈ సారి గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీ మరింత బలపడుతుంది…మరి ఇలాంటి పరిస్తితుల్లో తలసాని వారసుడుకు ఈ సారైనా గెలిచే ఛాన్స్ దక్కుతుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version