బ్రేకింగ్: ప్రముఖ సింగర్ కేకే గుండె పోటుతో మృతి..

-

ప్రముఖ గాయకుడు కేకే అలియాస్ కృష్ణకుమార్ కున్నాత్ హఠాత్తుగా మరణించారు. 53 ఏళ్ల ఈ బాలీవుడ్ సింగర్ గత ముప్పై ఏళ్ళుగా భారతీయ సినీ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఎన్నో హిట్ సాంగ్స్ ను అందించిన ఘనత ఆయనకు ఉంది. తన గాత్రంతో సంగీత ప్రియులను ఆకట్టుకున్నాడు..వయస్సు తో సంభంధం లేకుండా ఎప్పుడూ లైవ్ ఈవెంట్స్ తో ఫుల్ బిజీగా ఉంటారు.అందుకే ఆయన పాటలు వినడానికి జనం ఆసక్తి చూపిస్తారు.అలాంటి వ్యక్తి ఇక లేరు అనే వార్తను చాలా మందు జీర్ణించుకోలేక పోతున్నారు..

కోల్‌కతాలో జరిగిన ఒక వేడుకలో ప్రత్యక్షంగా ప్రదర్శన ఇస్తుండగా ఆయన కుప్పకూలి మరణించారు.దీంతో వెంటనే కేకేను నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కానీ ఆయన అప్పటికే మరణించినట్టు డాక్టర్లు ప్రకటించారు. కేకే తన ప్రోగ్రాంకు సంబంధించిన ఫొటోలను అంతకు ముందు తన సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా పోస్ట్ చేశాడు..కేకే భారతీయ చలనచిత్ర పరిశ్రమలో బహుముఖ గాయకుడిగా పేరుగాంచారు..హిందీ, తమిళ్, తెలుగు, బెంగాలి భాషల్లో ఎన్నో పాటలు పాడారు.

ఆయన పుట్టింది ఢిల్లీలో, చదువు,అన్నీ అక్కడే.. 1968 లో ఆగష్టు 23 న జన్మించారు.సింగింగ్ పై మక్కువ తో అటుగా లైఫ్ ను ఎంచుకున్నాడు.ఆయన భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.కేకే మృతి పై సినీ ప్రముఖులు,హీరోలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.ఆయనతో తమకున్న అనుభంధానికి సంభంధించిన వీడియోలను షేర్ చేశారు..ఈరోజు ఆయన అంత్యక్రియలు ఢిల్లీలో జరగనున్నాయి..ఆ కార్యక్రమానికి భారీగా సినీ ప్రముఖులు,అభిమానులు హాజరు కానున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version