కిషన్ రెడ్డి, బండి సంజయ్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు : తలసాని

-

బిజేపి నాయకులపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టిందని పేర్కొన్నారు. కానీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ అన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. గొర్రెల పంపిణీకి కేంద్రం వెయ్యి కోట్లు ఇస్తామని ఎగనామము పెట్టిందని మండిపడ్డారు.

ఆ వెయ్యి కోట్లు కూడా తెలంగాణ అప్పు తీసుకుని గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టిందని తెలిపారు. బండి సంజయ్ చెప్పినట్టు కేంద్రం వెయ్యి కోట్లు సబ్సిడీ ఇవ్వలేదని నిప్పులు చెరిగారు. బండి సంజయ్ బాధ్యతతో మాట్లాడాలి …పనికిరాని మాటలు వద్దని వార్నింగ్ ఇచ్చారు. కేంద్రం కు దమ్ము ఉంటే దేశ వ్యాప్తంగా గొర్రెల పంపిణీ చేపట్టాలని డిమాండ్ చేశారు. నేషనల్ కోపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి తీసుకున్న లోన్ ను పద్ధతి ప్రకారము తెలంగాణ సర్కారు చెల్లిస్తుందని స్పష్టం చేశారు. టిఆర్ఎస్ ఎంపీల కృషితోనే రామప్పకు యునెస్కో గుర్తింపు వచ్చిందని తెలిపారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version