తాలబన్ల దారుణాలు : ఆఫ్ఘనిస్తాన్ లో మహిళల వాయిస్ బంద్

-

మహిళలు పని చేసుకోవచ్చు… చదువుకోవచ్చు… మహిళలకు స్వేచ్ఛ ఇవ్వడానికి మేము కట్టుబడి ఉన్నాం అంటూ తాలిబన్లు ఇటీవల మీడియా వేదికగా పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా తాలిబన్లు తమ మాటను… పూర్తిగా మార్చేశారు. మీడియా వేదికగా చెప్పిన మాటలకు పూర్తి భిన్నంగా తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ కంట్రీ లో వ్యవహరిస్తున్నారు.

తాలిబన్లు ఏ మాత్రం మారలేదని ప్రస్తుత వారి చర్యలు స్పష్టం చేస్తున్నాయి. అందరూ ఊహించినట్లే తాలిబన్ నేతలు వ్యవహరిస్తున్నారు. మ్యూజిక్ , టీవీ మరియు రేడియో ఛానల్ లో ఆడవాళ్ళ వాయిస్ ను బ్యాన్ చేయాలని కాందహార్ లోని టీవీ ఛానల్ ను మరియు రేడియో స్టేషన్లను తాలిబన్ నేతలు ఆదేశించారు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ దేశంలో మహిళ గొంతు పూర్తిగా ఆగిపోయింది. కాగా…. ఆఫ్ఘనిస్తాన్ దేశంలో రాజ్యాంగ సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు… తాలిబన్ల పాలనలో… నరక యాతన అను భవిస్తున్నారు. తాలిబన్ల  నిర్ణయాలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news