ఆఫ్గ‌న్ గ‌డ్డ‌పై నేడే కొలువుదీర‌నున్న తాలిబ‌న్ల ప్ర‌భుత్వం..!

-

ఆఫ్గ‌నిస్తాన్ లో నేడు తాలిబ‌న్ల ప్ర‌భుత్వం కొలువుదీర‌నుంది. దాదాపు రెండు దశాబ్దాల త‌ర‌వాత తాలిబ‌న్లు మ‌ళ్లీ త‌మ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. శుక్రవారం ప్రార్థ‌న‌ల అనంత‌రం త‌మ ప్ర‌భుత్వం కొలువుదీర‌నుంద‌ని తాలిబ‌న్లు వెల్ల‌డించారు. అయితే త‌న ప్ర‌భుత్వం గ‌ణ‌తంత్ర ప్రభుత్వం కాద‌ని ఇస్లామిక్ ప్ర‌భుత్వం అని స్ప‌ష్టం చేశారు. ఇరాన్ మాదిరిగి త‌మ పాల‌న ఉండ‌బోతుంద‌ని చెబుతున్నారు. అంటే ఒక అత్యున్న‌త వ్య‌క్తి ప్ర‌ధాని లేదంటే అధ్య‌క్షుడు పాల‌న వ్యవ‌హారాల‌ను చూస్తార‌ని పేర్కొన్నారు.

అంతే కాకుండా తమ ప్ర‌భుత్వంలో గిరిజ‌నుల‌కు మ‌హిళ‌ల‌కు కూడా ప్రాతినిధ్యం ఉంటుంద‌ని తాలిబాన్ల రాజకీయ విభాగం చీఫ్ షేర్‌ మహమ్మద్‌ అబ్బాస్‌ స్టానిక్జాయ్‌ ప్రకటించారు. ఇప్ప‌టికే క్యాబినెట్ స‌భ్యుల పేర్ల‌ను ఎంపిక చేశామని శుక్ర‌వారం ప్ర‌క‌టిస్తామ‌ని చెప్పారు. శుక్ర‌వారం ప్రార్థ‌న త‌ర‌వాత ప్ర‌మాణ స్వీకారాలు ఉంటాయ‌ని స్ప‌ష్టం చేశారు. ముల్లా అఖుంద్‌జాదా కాందహార్‌ నుంచే ప్రభుత్వానికి దిశానిర్దేశం చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.

Read more RELATED
Recommended to you

Latest news