పారాలింపిక్స్ : ఇండియాకు మరో సిల్వర్

పారా లింపిక్స్ లో భారత క్రీడాకారులు తమ జోరును కొనసాగిస్తున్నారు. ఇప్పటికే పలు పతకాలు సాధించిన నా భారత్ తాజాగా తన ఖాతాలో మరో సిల్వర్ మెడల్ వేసుకుంది. పురుషుల హైజంప్ లో భారత్ కు సిల్వర్ పతకం దక్కింది. పురుషుల హైజంప్ లో భారత క్రీడాకారుడు ప్రవీణ్ కుమార్ 2.07 మీటర్ల ఎత్తు జంపు చేసి ఈ రజత పతకాన్ని సాధించాడు. దీంతో హై జంపు లో భారత్ కు ఇది నాలుగో పతకం కాగా ఇంతకు ముందు 3 రజత పతకాలు భారత్ కు వచ్చాయి.

ప్రవీణ్ కుమార్ తో పాటు మరిఅప్పన్, నిషడ్, మరియు శరద్ హై జంపు లో సిల్వర్ పతకాలను సాధించారు. ఇక మన భారత ఖాతాలో మొత్తం పతకాల సంఖ్య 11కు చేరింది. ఇందులో 2 గోల్డ్ పతకాలు ఉండగా… 6 సిల్వర్ మరియు 3 బ్రాంజ్ పతకాలు ఉన్నాయి. మరోవైపు 18 సంవత్సరాల ప్రవీణ్కుమార్ ఇండియా తరఫున యంగెస్ట్ పారాలింపియన్ గా రికార్డు సృష్టించాడు. అంతేకాదు హై జంపు లో రజతం సాధించి చరిత్ర సృష్టించాడు ప్రవీణ్ కుమార్.