Tamannaah: డైలామాలో ప‌డ్డ మిల్క్ బ్యూటీ.. ఆ విష‌యంలో ఇంకా క్లారీటి లేదంట‌!

-

Tamannaah: సాధారణంగా ఏదైనా సినిమా ప్రారంభిస్తే ముందుగానే.. న‌టిన‌టుల‌కు, ఇత‌ర టెక్నిషియ‌న్స్ తో ఓ ఒప్పందం చేసుకుని.. అడ్వాన్స్ ఇస్తుంటారు. లేదంటే.. వెయిటింగ్ మోడ్ లో ఉంచుతారు. అలాంటి ప‌రిస్థితిలోనే టాలీవుడ్ మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా ఉన్న‌ట్టు తెలుస్తుంది. డైలామాలో ప‌డింద‌ట‌.. అదికూడా మెగాస్టార్ చిరంజీవి వ‌ల్ల‌.. ఆ సంగ‌తేంటో తెలుసుకుందాం!

ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తూ.. దూసుకపోతున్నాడు మెగాస్టార్. ఇప్ప‌టికే కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య షూట్ పూర్తి చేశాడు. తాజాగా మలయాళీ రీమేక్ చిత్రం గాడ్ ఫాదర్ లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.. ఈ రెండు సినిమాలతో పాటు ఆయన మెహెర్ రమేష్ దర్శకత్వంలో తమిళ వేదాళం రీమేక్ భోళా శంకర్ అనే సినిమా కూడా చేస్తున్నారు.

ఈ సినిమాలో చిరంజీవితో పాటు మరో కీలకపాత్రలో కీర్తి సురేష్ నటిస్తున్న విష‌యం తెలిసిందే.. కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా తమన్నా సెల‌క్ఠ్ చేసిన‌ట్టు తెలుస్తుంది. కానీ, దీనిపై అధికారిక ప్రకటన ఇక రాలేదు. చిరు సినిమా కోసం… ఆమెను హీరోయిన్ గా అడిగినా దానిపై పూర్తిగా క్లారిటీ రాలేదు. త‌మ‌న్నా ఇంకా అడ్వాన్స్ పంపలేదట. దాంతో ఆమె వేరే ప్రాజెక్టు సైన్ చేయాలా లేక డేట్స్ ఖాళీ పెట్టుకోవాలా అనే సందిగ్గంలో ఉంది. ఈ క్ర‌మంలో ఆమెకు బాలీవుడ్ సినిమా అవ‌కాశం వ‌చ్చింది.

ఇదిలా ఉంటే.. మ‌రోవైపు..`భోళా శంకర్` షూటింగ్ వాయిదా పడిన‌ట్టు తెలుస్తుంది. విశ్వ‌నీయ స‌మాచారం మేర‌కు గాడ్ ఫాద‌ర్ సినిమా షూట్ పూర్తయిన వెంట‌నే.. భోళా శంక‌ర్ షూటింగ్ ప్రారంభించాల‌ని, అది కూడా వచ్చే ఏడాది సమ్మర్ లో భోళా శంకర్ ను ప్రారంభించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. అందుకే తమన్నా కు అడ్వాన్స్ ఇవ్వ‌లేద‌ని సమాచారం.

మెహర్ రమేష్‌ దర్శకత్వంలో వ‌స్తున్న ఈ భోళా శంకర్ చిత్రానికి తొలుత‌ హీరోయిన్ గా కాజల్ ని అనుకున్నారు. కానీ ఆమెకు ప్రెగ్నిన్సీ రావటంతో.. ప‌క్క‌న పెట్టార‌నీ.. ఆ స్థానంలో తమన్నాను ఎంచుకున్నట్టు తెలుస్తుంది. త‌మ‌న్నా కూడా చాలా బిజీ బిజీగా ఉంది. ప్రస్తుతం ఈ అమ్మ‌డు నాగార్జునతో ది ఘోస్ట్ సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version