హైద‌రాబాద్‌లో చిర్రెత్తిస్తున్న చింత‌కాయ రేటు..!

-

చింత‌కాయ పేరు చెప్ప‌గానే అంద‌రికి నోనూరుతుంది. గతంలో గణేశ్‌ నవరాత్రులు వస్తున్నాయంటే మార్కెట్లో ఎక్కడ చూసినా లేత చింతకాయ క‌నిపిస్తుంటాయి. కానీ ఈ సంవ‌త్స‌రం మాత్రం ఎక్క‌డా కూడా చింత‌కాయ‌లు క‌నిపించ‌డం లేదు. సంప్రదాయ పండుగలన్నింటిలో చింతపండు అవసరం ఉంటుంది. ఈ ఏడాది చింత చెట్లకు పూత, కాత లేకపోవడంతో చింత కాయల కొర‌త ఏర్ప‌డంతో చింత ధరకు రెక్కలు వ‌చ్చాయి.


అయితే కిలో చింతపండు ధర రూ. 1000. ఆదివారం సంగారెడ్డి జిల్లా జోగిపేట అంగట్లో కిలో చింతకాయల ధర రూ. 1000 చొప్పున విక్రయించారు. ఇటు నారాయణఖేడ్, సంగారెడ్డి ప్రాంతాల్లో మాత్రం కిలో రూ.350, రూ.400, రూ.600 చొప్పున ఖ‌రారు చేశారు. హైదరాబాద్ మార్కెట్‌లో మాత్రం కిలో చింతకాయలు రూ.600లు పలుకుతుంది. ఇక హోల్ సెల్, రైతు బజార్లలో రూ.550 వరకు ప‌లికింది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ఈ క్ర‌మంలోనే చింతపండు ధరలను చూస్తే ఆందోళన కలిగిస్తోంది. నిత్యావసరం కావడంతో చింతపండు లేని ఇళ్లంటూ ఉండవు. అయితే ఈసారి ఆశించిన స్థాయిలో చింతకాయ కాపు లేకపోవడంతో దీని రేటు పెరిగిపోతోంది. ఇక ఈ ఏడాది చింతపండు లభ్యం కాలక్రమేణా తగ్గిపోతోంది. ఈ క్ర‌మంలోనే చాలా జాగ్ర‌త్త‌గా చింత పండును బాగా తగ్గించి వాడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news