ఎన్నికల ముంగిట తమిళనాడు రైతులకు అక్కడి గవర్నమెంట్ శుభవార్త వినిపించింది. వ్యవసాయ రుణాలు తీసుకున్న 16 లక్షల మంది రైతులకు తమిళనాడు ప్రభుత్వం సుమారు రూ.12 వేల కోట్లు మాఫీ చేస్తున్నామని ప్రకటించింది. మరి కొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. సహకార బ్యాంకుల నుంచి తీసుకున్న సుమారు రూ.12,110 కోట్ల రైతు రుణాలను మాఫీ చేయనున్నట్లు సీఎం పళనిస్వామి ఈరోజు ప్రకటించారు.
ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ ఈ విషయాన్ని ప్రకటించారు. మరో పక్క తమిళ నాట రాజకీయాలు ఉత్కంఠగా సాగుతున్నాయి. అన్నాడీఎంకే, శశికళ మధ్య రోజుకో ట్విస్ట్‌తో అత్యంత ఆసక్తికరంగా మారాయి. నిన్నామొన్నటి దాకా శశికళ కారుపై అన్నాడీఎంకే జెండా చిహ్నం హాట్‌టాపిక్ అయింది. అయితే దీనిపై మండిపడుతున్నారు అన్నాడీఎంకే నేతలు. డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు. తమ పార్టీ జెండా ఉపయోగించుకున్న శశికళపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు అన్నాడీఎంకే నాయకులు.