ఇక్కడ మిర్యాలగూడ పరువు హత్య.. అక్కడ తమిళనాడులో పరువు హత్య. రెండూ ఒకే స్టోరీలు. కానీ.. వేర్వేరు ప్రదేశాల్లో జరిగాయి. తమిళనాడులో దళిత యువకుడు శంకర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నది కౌసల్య. కౌసల్యది అగ్ర కులం. దీంతో కౌసల్య తండ్రి ఆ యువకుడి మీద కక్ష్య గట్టి 2016 మార్చి 13న కిరాయి హంతకులతో చంపించాడు. తన భర్తపై దాడి జరుగుతున్నప్పుడు కౌసల్య.. కిరాయి హంతకులతో పోరాడింది. తనకు కూడా గాయాలయ్యాయి. తలకు 36 కుట్లు పడ్డాయి. తను బతికి బయటపడింది. కానీ.. భర్తను కాపాడుకోలేకపోయింది. ఇక్కడ మిర్యాలగూడలో జరిగిన పరువు హత్య కూడా అలాంటిదే.
ఇక్కడ జరిగిన హత్య గురించి తెలుసుకున్న కౌసల్య.. ఇటీవల మిర్యాలగూడ వెళ్లి అమృతను కలిసింది. తనకు మద్దతు తెలిపింది. కులాంతర వివాహితుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఈసందర్భంగా కౌసల్య డిమాండ్ చేసింది. తన భర్తను హత్య చేసిన తన తండ్రికి, కిరాయి రౌడీలకు మరణ శిక్ష పడేవరకు నిద్రపోలేదట కౌసల్య. 58 సార్లు తన తండ్రి బెయిల్‌కు రాకుండా అడ్డుకున్నదట కౌసల్య. తన భర్త పేరు మీద శంకర్ సోషల్ జస్టిస్ అనే ట్రస్టు ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు విద్యనందిస్తున్నది. అంతే కాదు.. డప్పు పట్టుకొని ఊరూరా తిరుగుతూ కులాంతర వివాహాలకు మద్దతు తెలుపుతూ ప్రచారం చేస్తున్నది.